Event Page

«Prev From Dec 16, '25 to Jan 15, '26 Next»
4611
Maya Bazaar 60 year Celebration
Thu Nov 9, 3:30 PM
Bharadwaja Rangavajhala
Maya Bazaar Successfully completed 60 years...we are going to celebrate this beautiful occasion at Lamakaan with the support of LamakaanTeam
విజ‌యావారి మాయాబ‌జార్ ప్రేమికుల‌కు ఆహ్వానం
తెలుగు తెర అద్భుతం విజ‌యా వారి మాయాబ‌జార్ సినిమా విడుద‌లై 2017 మార్చి 27 నాటికి అర‌వై ఏళ్లు. ఆ సంద‌ర్భంగా చాలా ప‌త్రిక‌లు ప్ర‌త్యేక‌ వ్యాసాలు వెలువ‌రించాయి. కొన్ని సాంస్కృతిక సంస్ధ‌ల వారు స‌మావేశాలూ పెట్టారు. అయితే ... ఇప్పుడు ....
మాయాబ‌జార్ ష‌ష్టిపూర్తి సంవ‌త్స‌రం ముగింపు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 9వ తేదీన
హైద్రాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబ‌ర్ ఒన్ , జీవీకే మాల్ ద‌గ్గ‌ర్లో ఉన్న లా మ‌కాన్ లో మాయాబ‌జార్ స్క్రీనింగ్ జ‌రుపుతున్నాం.సినిమా స్క్రీనింగుతో పాటు సినిమా మ‌న‌పై వేసిన ముద్ర‌ను గురించి మాట్లాడుకోడానికి ఇష్టాగోష్టి స‌మావేశం కూడా ఏర్పాటు చేయ‌డం జరిగిన‌ది.
మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల‌కు స్క్రీనింగు కార్య‌క్ర‌మం ఉంటుంది. స్క్రీనింగ్ ముగిసిన అనంత‌రం చిత్ర విశేషాల‌పై స‌మావేశం జ‌రుగుతుంది. ఈ స‌మావేశాన్ని స‌భ‌ను ఓల్డ్ సినిమా ల‌వ‌ర్స్ వారు మూవీ వాల్యూమ్ యుట్యూబ్ ఛాన‌ల్ (https://www.youtube.com/movievolume ) మ‌రియు లామ‌కాన్ ఫిలిం స‌ర్కిల్ స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తున్నారు. మాయాబ‌జార్ మీద అభిమానం ఉన్న వారంద‌రూ ఆహ్వానితులే ... మాయాబ‌జార్ మీద ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కో థీసిస్ మ‌న‌స్సుల్లో రాసేసుకుని ఉంటారు. వాటిని అక్క‌డ మాతో పంచుకుంటే బాగుంటుంది క‌దా ...
విజ‌యా సంస్ధ‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన వారు విజ‌య‌చిత్ర సంపాద‌క వ‌ర్గంలో ప‌నిచేసిన శ్రీ రావి కొండ‌ల‌రావు గారు ప్ర‌త్యేక ఆహ్వానితులు.
రండి ... మాయాబ‌జార్ షష్టిపూర్తి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుందాం ....
గ‌మ‌నిక ః ఈ ఆహ్వాన‌ప‌త్రిక‌ను షేర్ చేసి మీ మిత్ర బృందంలోని మాయాబ‌జార్ ప్రేమికులు కూడా స‌మావేశానికి వచ్చేలా తోడ్పాటు అందించ‌గ‌ల‌ర‌ని మ‌న‌వి ....